ప్రధాన కంటెంట్‌కి దాటండి
OpenAI

20 అక్టోబర్, 2026

ChatGPT వర్క్‌తో 94% తక్కువ సమయంలో క్యాష్ లెక్క సరిచూసే ఫ్రాంచైజీ

Schlotzsky’s, Cinnabon స్వతంత్ర ఫ్రాంచైజీ యజమాని ధరల సవరణకు పట్టే సమయాన్ని 95% తగ్గించారు. క్యాష్ ప్రవాహంలో $100,000 వరకు వినియోగానికి అందుబాటులోకి తేగల పనివిధానాన్ని రూపొందించారు.

వెచ్చని మట్టి ఎరుపు రంగు కాగితపు నేపథ్యంపై Schlotzsky’s, Cinnabon చిహ్నాలు.
కంపెనీ పరిమాణం: SMB
ప్రాంతం: ఉత్తర అమెరికా
పరిశ్రమ: ఆహారం & పానీయాలు
ప్రోడక్ట్స్: ChatGPT

95%

ధరల విశ్లేషణకు పట్టే సమయం 5 రోజుల నుంచి 1–2 గంటలకు తగ్గింది

$100,000

సిబ్బంది పనివిధానాన్ని మెరుగుపరచడం ద్వారా ఏటా వినియోగానికి అందుబాటులోకి రాగల గరిష్ఠ క్యాష్

4

వేతనాలు చెల్లించే ప్రతిసారీ స్వయంగా చేయాల్సిన పనిలో ఆదా అయిన గంటలు

94%

నెలవారీ క్యాష్ లెక్కలు సరిపోల్చడానికి పట్టే సమయంలో తగ్గుదల

లోడ్ అవుతోంది…

సెమీకండక్టర్ పరిశ్రమలో 25 ఏళ్లు పనిచేసిన తర్వాత Ted Taylor రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన స్వతంత్ర ఫ్రాంచైజీ యజమానిగా న్యూ మెక్సికోలో Schlotzsky’s, Cinnabon రెండు బ్రాండ్‌లతో నడిచే మూడు రెస్టారెంట్‌లను నిర్వహిస్తున్నారు.

వేగంగా ఆహారం అందించే రెస్టారెంట్ల నిర్వహణలో వినియోగదారులకు మంచి అనుభవం కల్పిస్తూనే, వారికి కనిపించని ఎన్నో పనులనూ చూసుకోవాలి. వంటకాల ధరల నిర్ణయం, సిబ్బంది నియామకం, పరికరాల నిర్వహణ, విధానాల రూపకల్పన వంటివి ఇందులో భాగమే. ఈ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు Ted OpenAI సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

ChatGPTతో Ted రీసెర్చ్, డ్రాఫ్టింగ్ వంటి సమయం పట్టే పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ధరలు, అమ్మకాలు, అంచనాలు, షెడ్యూల్‌లు, సిబ్బందికి సంబంధించిన పెద్ద మొత్తంలో డేటాను సేకరించి, అనలైజ్ చేయడానికి, ప్రతి రెస్టారెంట్‌లో ఏ అంశాలపై దృష్టి పెట్టాలో సూచనలు పొందడానికి ChatGPT Workను ఉపయోగిస్తున్నారు. దీంతో ధరలను మార్చడానికి పట్టే సమయాన్ని 95% తగ్గించడంతో పాటు, ప్రతిసారి పేరోల్ ప్రాసెస్ చేయడంలో నాలుగు గంటలు ఆదా చేస్తున్నారు.

“ChatGPT వర్క్ సిఫార్సులు ఎంత బాగుంటాయంటే, వాటితో మొదలుపెట్టి అవసరమైన సర్దుబాట్లు చేసుకోవడం వల్ల పని చాలా వేగంగా పూర్తవుతుంది.”
—Ted Taylor, స్వతంత్ర ఫ్రాంచైజీ యజమాని, Schlotzsky’s మరియు Cinnabon

మూడు మార్కెట్లలో వంటకాల ధరల సవరణ నిమిషాల్లోనే

వంటకాల ధరలను ఏటా సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాటి తయారీ ఖర్చులు, ప్రజాదరణ, స్థానిక పోటీదారుల ధరలు, వడ్డించే పరిమాణాలు, రెస్టారెంట్‌లో అందించే ఆర్డర్లు, ఇంటికి పంపే ఆర్డర్ల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను లోతుగా విశ్లేషించాలి. Ted ఈ అంశాలన్నింటినీ సమన్వయం చేసి ధరలపై సిఫార్సులు పొందేందుకు ChatGPT వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. దీనికి 5 రోజుల బదులు 1–2 గంటలే పడుతున్నాయి.

“ప్రతి వంటకం ధరను విశ్లేషించి నిర్ణయించడానికి నాకు కొన్ని రోజుల పని పట్టేది. అదే పనిని ChatGPT వర్క్ క్షణాల్లో, మరింత సమగ్రంగా పూర్తి చేస్తుంది.”
—Ted Taylor, స్వతంత్ర ఫ్రాంచైజీ యజమాని, Schlotzsky’s మరియు Cinnabon

ముందుగా స్థానిక పోటీదారుల ధరల పోకడలు, వడ్డించే పరిమాణాలు, ఆహార నాణ్యతలో తేడాలను అధ్యయనం చేసి, తన ధరల లక్ష్యాలు, వ్యూహాలను నిర్ణయించుకోవడానికి Ted ChatGPT వర్క్‌ను ఉపయోగిస్తారు. ఆ తర్వాత వంటకాలను వర్గాలుగా విభజించిన జాబితాను, వాటి ప్రస్తుత రెస్టారెంట్ ధరలు, ఇంటికి పంపే ఆర్డర్ల ధరలతో సహా ChatGPT వర్క్‌కు అందిస్తారు. ప్రధానంగా ChatGPT ఇంతకుముందు చేసిన విశ్లేషణ ఆధారంగా, ప్రతి ధరల సమూహాన్ని మొత్తంగా ఎంత పెంచాలనుకుంటున్నారో, ఏ వంటకాల ధరలను ఎక్కువగా లేదా తక్కువగా పెంచాలో వివరిస్తారు.

ప్రతి వంటకం గత అమ్మకాల వివరాలు, సరఫరాదారుల ధరలను జోడించి ఈ విశ్లేషణను మరింత సమగ్రంగా చేయవచ్చు. ఈ వివరాలతో ChatGPT వర్క్ ధరల మార్పులు అమ్మకాలపై చూపే ప్రభావాన్ని అంచనా వేయగలదు. వస్తువుల వ్యయ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి వంటకం ధరను మెరుగ్గా నిర్ణయించగలదు.

రెస్టారెంట్‌లో అందించే ఆర్డర్లు, ఇంటికి పంపే ఆర్డర్లకు సిఫార్సు చేసిన ధరలను ChatGPT వర్క్ ఒక గణన పట్టికలో అందిస్తుంది. వినియోగదారులను నిలుపుకోవడం, ధరల పెరుగుదలతో వారు బెంబేలెత్తకుండా చూడటం, అదనపు పదార్థాలను ఆకర్షణీయంగా అందించడం వంటి వ్యాపార ఫలితాలను మెరుగుపరిచే సమగ్ర ధరల వ్యూహంతో ఈ మార్పులను అనుసంధానిస్తుంది కూడా.

ధరల నిర్ణయానికి Ted మొదటిసారి ChatGPT వర్క్‌ను ఉపయోగించినప్పుడు, స్వయంగా కూడా అదే విశ్లేషణ చేశారు. “ChatGPT వర్క్ స్థానిక ధరలను మరింత లోతుగా పోల్చింది. కొన్ని వంటకాలు పోటీలో నిలవలేనంతగా వాటి ధరలు పెంచకుండా నాకు తోడ్పడింది” అని ఆయన అన్నారు. వెంటనే Ted తొలి సిఫార్సులను రూపొందించేందుకు ChatGPTని ఉపయోగించడం ప్రారంభించారు.

సిబ్బందిని సమర్థంగా వినియోగించుకుని, క్యాష్ అందుబాటును పెంచే మార్గాల అన్వేషణ

సిబ్బంది వ్యయాలను నియంత్రించడానికి Ted రెండు విధాలుగా ChatGPT వర్క్‌ను ఉపయోగిస్తున్నారు: తన మూడు రెస్టారెంట్లలో సిబ్బంది పనిగంటలు, వ్యయాలను సమీక్షించడం, వారపు పని వేళల పట్టికను రూపొందించడానికి మెరుగైన పద్ధతిని పరీక్షించడం.

సిబ్బంది వ్యయాల విశ్లేషణ కోసం Ted తన అమ్మకాలు, సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని కేవలం చదవడానికి మాత్రమే ChatGPT వర్క్‌కు అనుమతి ఇచ్చారు. ఆయన విశ్లేషణ చేయించినప్పుడు, అది పట్టికలో కేటాయించిన పనిగంటలు, బడ్జెట్‌లో అనుకున్న పనిగంటలు, వాస్తవ పనిగంటలను అంచనా వేసిన, వాస్తవ అమ్మకాలతో పోలుస్తుంది. అమ్మకాల అంచనాలను తరచూ మించే లేదా అందుకోలేకపోయే రెస్టారెంట్ల పరిస్థితిని పరిగణనలోకి తీసుకునేందుకు గత 12 వారాల వివరాలనూ సమీక్షిస్తుంది. దీని ఆధారంగా రూపొందిన నివేదిక అదనపు పనిగంటలను, అనుకున్నదానికంటే ఎక్కువసేపు సాగుతున్న పని వేళలను, సిబ్బంది సరిపోని సమయాలను గుర్తిస్తుంది. నిర్వాహకులు ఏ అంశాలను సమీక్షించాలో స్పష్టం చేస్తుంది.

పని వేళల కేటాయింపు పరీక్ష కోసం Ted ప్రతి ఉద్యోగి బాధ్యత, శిక్షణ, అందుబాటులో ఉండే సమయం, వేతనంతో కూడిన జాబితాను ChatGPT వర్క్‌కు ఇచ్చారు. వివిధ స్థాయుల అమ్మకాలకు రెస్టారెంట్‌లో ఎంతమంది సిబ్బంది అవసరమో కూడా తెలిపారు. ఆయన, నిర్వాహకురాలు కలిసి ChatGPT వర్క్ సూచించిన పని వేళల పట్టికను ఆమె స్వయంగా రూపొందించే పట్టికతో పోల్చారు. రద్దీ సమయాల్లో అదనపు సిబ్బందిని ఎప్పుడు కేటాయించాలన్న విషయంలో ఇవ్వని నియమాలను గుర్తించి, ChatGPT వర్క్‌కు ఇచ్చే సూచనలను మెరుగుపరిచారు.

ఇప్పుడు ChatGPT వర్క్ ఆ రెస్టారెంట్‌కు పూర్తి పని వేళల పట్టికను రూపొందిస్తోంది. నిర్వాహకురాలు దాన్ని పరిశీలించి, అవసరమైతే సర్దుబాట్లు చేసి, రెస్టారెంట్ పని వేళల నిర్వహణ వ్యవస్థలో నమోదు చేస్తారు. పని వేళలను మెరుగ్గా కేటాయించడం వల్ల క్రమంగా మూడు రెస్టారెంట్లలోనూ గంటల వారీ సిబ్బంది వ్యయం, అమ్మకాలలో వాటాగా ఒకటి నుంచి రెండు శాతం పాయింట్లు తగ్గవచ్చని Ted అంచనా వేస్తున్నారు. దీంతో ఏటా $50,000 నుంచి $100,000 వరకు అదనపు క్యాష్ వినియోగానికి అందుబాటులోకి రావచ్చు. దాన్ని వేతనాల పెంపు, బోనస్‌లు, వ్యాపారంలో పెట్టుబడులు లేదా లాభాల పంపిణీ పెంపు కోసం ఉపయోగించవచ్చు.

ChatGPT వర్క్‌తో అంతర్గత నిర్వహణ పనులు మరింత వేగంగా

HR పాలసీలను రూపొందించడం నుంచి క్యాష్ లెక్కలను సరిచూసుకోవడం, సరఫరాలు, రిపేర్‌లకు సంబంధించిన రిక్వెస్ట్‌లను నిర్వహించడం వరకు రోజువారీ పనులకు కూడా Ted ChatGPT వర్క్‌నుఉపయోగిస్తున్నారు. 

శరీర ద్రవాలు చిందిన ఘటనలను ఎదుర్కొనే విధానాన్ని రెస్టారెంట్లు లిఖితపూర్వకంగా ఉంచాలని న్యూ మెక్సికో తప్పనిసరి చేసినప్పుడు, Ted, ChatGPTతో సుమారు 30 సెకన్లలో డ్రాఫ్ట్‌ రాయించారు. ఉద్యోగుల మార్గదర్శక పుస్తకానికి సామాజిక మాధ్యమాల వినియోగ విధానం అవసరమైనప్పుడు, Ted త్వరగా మార్గదర్శకాల డ్రాఫ్ట్‌ను రూపొందించడానికి ChatGPT తోడ్పడింది. తర్వాత బయటి మానవ వనరుల సేవా సంస్థ దాన్ని సమీక్షించి ఎలాంటి మార్పులూ చేయలేదు.

తన మూడు రెస్టారెంట్లలో నెలవారీ క్యాష్ లెక్కలను సరిపోల్చడానికి Ted, ChatGPT వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రతి రెస్టారెంట్ క్యాష్ లావాదేవీల వివరాలు, బ్యాంకు రికార్డులను ఆయన అప్‌లోడ్ చేస్తారు. ChatGPT వర్క్ ఆ లావాదేవీలను సంబంధిత జమలతో పోలుస్తుంది. నెలవారీ లెక్కల సరిపోలికకు గతంలో మూడు గంటలు పట్టేది. ఇప్పుడు 5–10 నిమిషాలే పడుతోంది. వేతనాల చెల్లింపునకు అవసరమైన వివరాలను ChatGPT వర్క్‌తో సంగ్రహింపజేయడం ద్వారా, ప్రతి చెల్లింపు చక్రంలో స్వయంగా చేయాల్సిన పనిని నాలుగు గంటల మేర తగ్గించుకున్నారు.

రెస్టారెంట్లు సజావుగా నడిచేందుకు, ఉద్యోగులు సరఫరాలు లేదా మరమ్మతుల కోసం అభ్యర్థనలు పంపగల వెబ్ పోర్టల్‌ను కూడా Ted ChatGPT వర్క్‌తో రూపొందించారు. ఈ పోర్టల్ ప్రత్యేక ఈమెయిల్ చిరునామా ద్వారా ఆయనకు తెలియజేస్తుంది. ప్రతి అభ్యర్థన స్థితినీ నమోదు చేస్తుంది.

వ్యాపారాన్ని నడపడానికే కాదు, మెరుగుపరచడానికీ మరింత సమయం

Ted ChatGPT వర్క్‌ను ఉపయోగించే పద్ధతి ఏ చిన్న వ్యాపార యజమానికైనా ఆచరణలో పెట్టదగినదే. తాను నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగించే సమాచారాన్ని, మార్గదర్శకాలనే ఆయన ChatGPTకి ఇస్తారు. అది ఇచ్చే ఫలితాన్ని తాను స్వయంగా ఆ పని చేస్తే వచ్చే ఫలితంతో పోలుస్తారు. ఫలితాలపై నమ్మకం పెరిగేకొద్దీ వ్యాపారంలోని మరిన్ని పనులకు దాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే అమలు చేసే ముందు ప్రతిసారీ ఫలితాలను సమీక్షిస్తారు.

Ted దృష్టిలో ChatGPT వర్క్ విలువ కేవలం సమయాన్ని ఆదా చేయడానికే పరిమితం కాదు. ఇది లేకపోతే వదిలేసి ఉండే విశ్లేషణలనూ ఇప్పుడు చేయగలుగుతున్నారు. వినియోగదారులు, ఉద్యోగులు, వ్యాపార వృద్ధిపై మరింత సమయం వెచ్చించగలుగుతున్నారు.

కొత్త పని యుగంలో చేరండి

ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్లకు పైగా వ్యాపారాలు OpenAI తో అర్థవంతమైన ఫలితాలను సాధిస్తున్నాయి.