OpenAI

OpenAI CSAM వర్గీకరణ సాధనం కోసం దరఖాస్తు

OpenAI CSAM వర్గీకరణ సాధనంపై ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు. మీ సంస్థ గురించి, ప్రస్తుతం అమలు చేస్తున్న రక్షణలు, ముప్పును తగ్గించే చర్యల గురించి, మీరు ఉపయోగించాలనుకుంటున్న విధానం గురించి తెలుసుకోవడానికి, ఈ సాధనం మీ పని ప్రక్రియకు అనువైనదో లేదో అర్థం చేసుకోవడానికి ఈ పత్రం మాకు సహాయపడుతుంది. వినియోగ అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము.

దరఖాస్తుదారు వివరాలు

వృత్తిపరమైన వినియోగం

మీరు ప్రస్తుతం CSAM‌ను గుర్తించడానికి లేదా ఇప్పటికే గుర్తించిన CSAM‌తో సరిపోల్చడానికి ఏవైనా ఇతర పరిష్కారాలను ఉపయోగిస్తున్నారా? *
మీ సంస్థలో CSAM‌ను సిబ్బంది స్వయంగా సమీక్షించే ప్రక్రియలు అమలులో ఉన్నాయా? *
CSAM‌గా కనిపించే కంటెంట్‌ను, వర్తించే సందర్భాల్లో, NCMECకి మరియు/లేదా సంబంధిత సంస్థలకు నివేదించే ప్రక్రియ మీ సంస్థలో ఉందా? *
మీ సంస్థ NCMECలో నమోదు చేసుకుందా? *

చట్టపరమైన నిబంధనలు, ధ్రువీకరణలు

నేను ఈ అంశాలను ధ్రువీకరిస్తున్నాను:

  1. నా సమాధానాలు, ధ్రువీకరణలతో సహా ఈ దరఖాస్తు పత్రాన్ని (వీటన్నింటినీ కలిపి “దరఖాస్తు పత్రం”గా పేర్కొంటాము) నేను సమీక్షించాను. తగిన విచారణ జరిపి, సముచిత శ్రద్ధతో పరిశీలించిన తర్వాత, నాకు తెలిసినంతవరకు, నేను విశ్వసిస్తున్న మేరకు అందించిన సమాచారం ఖచ్చితంగా, సంపూర్ణంగా ఉందని ప్రకటిస్తూ ధ్రువీకరిస్తున్నాను.

  2. ఈ దరఖాస్తు పత్రంలో పేర్కొన్న సంస్థ (“వినియోగదారు”) తరఫున ఈ పత్రంపై సంతకం చేయడానికి నాకు అవసరమైన అధికారం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవసరమైన అన్ని అంతర్గత ఆమోదాలను పొందాను.

  3. ఈ దరఖాస్తు పత్రంలోని ఏ సమాచారమైనా ఖచ్చితంగా, సంపూర్ణంగా లేదని లేదా ఇకపై అలా ఉండదని నాకు తెలిస్తే, వెంటనే OpenAI‌కి లిఖితపూర్వకంగా (csamclassifier@openai.com) తెలియజేస్తాను.

  4. ఈ దరఖాస్తు పత్రంలోని చట్టపరమైన నిబంధనలను వినియోగదారు అంగీకరిస్తున్నారు. ఈ నిబంధనలు ఇందుమూలంగా ఒప్పందంలో భాగమవుతాయి. “ఒప్పందం” అంటే: (a) సేవలకు సంబంధించి వినియోగదారు, OpenAI మధ్య ఇప్పటికే సంతకం చేసిన ఒప్పందం ఉంటే, వినియోగదారు సేవల వినియోగానికి ఆ ఒప్పందం వర్తిస్తుంది; లేదా (b) సేవలకు సంబంధించి వినియోగదారు, OpenAI మధ్య ఇప్పటికే సంతకం చేసిన ఒప్పందం లేకపోతే, వినియోగదారు సేవల వినియోగం https://openai.com/policies/services-agreement వద్ద అందుబాటులో ఉన్న OpenAI సేవల ఒప్పందానికి లోబడి ఉంటుంది. ఈ దరఖాస్తు పత్రంలో నిర్వచించని, ఆంగ్ల మూలంలో పెద్ద అక్షరంతో ప్రారంభమయ్యే పదాలకు ఒప్పందంలో పేర్కొన్న అర్థాలే వర్తిస్తాయి.

దరఖాస్తుదారు ధ్రువీకరణ *
కార్యక్రమ నిబంధనలకు అంగీకారం *

గమనిక: సమర్పించిన తర్వాత, మీ గుర్తింపును నిర్ధారించేందుకు చిన్న ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయమని మిమ్మల్ని అడగవచ్చు. ఇందులో ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని చూపించడం, ప్రాథమిక బిజినెస్ సమాచారాన్ని అందించడం ఉండవచ్చు.