OpenAI

ChatGPTని బాధ్యతాయుతంగా ఉపయోగించడం

జ్ఞానం ఆధారంగా చేసే పనుల తీరును సమూలంగా మార్చేస్తున్న కొత్త సాంకేతికత AI. ChatGPTకి ఆధారమైన భారీ భాషా మోడళ్లకు (ఎల్‌ఎల్‌ఎమ్‌లు) బహిరంగంగా అందుబాటులో ఉన్న అపారమైన పాఠ్యం, ఇతర డేటాతో శిక్షణ ఇస్తారు. తద్వారా అవి భాషను అంచనా వేసి, మనుషుల మాదిరిగా భాషను రూపొందించగలవు. దీనివల్ల అవి ముసాయిదాలు రాయడం, సారాంశాలు రూపొందించడం, కొత్త ఆలోచనలు చేయడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనుల్లో తోడ్పడతాయి. ప్రజలు మరింత సమర్థంగా, సృజనాత్మకంగా పనిచేయడానికి సహాయపడతాయి.

ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, AIని బాధ్యతాయుతంగా ఉపయోగించడం ముఖ్యం. ఈ మోడళ్లు కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని అందించవచ్చు. అవి తేల్చిన విషయాలను జాగ్రత్తగా పరిశీలించకుండా అమలు చేస్తే దుర్వినియోగానికి దారితీయవచ్చు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) మానవాళి అంతటికీ ప్రయోజనం చేకూర్చేలా చూడటమే OpenAI లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ఒక్కరూ దాన్ని సురక్షితంగా, ఆలోచనాత్మకంగా ఉపయోగించాలి. ChatGPTని కొత్తగా ఉపయోగిస్తున్న ఎవరైనా దాన్ని సురక్షితంగా, సమర్థంగా వాడేందుకు అవసరమైన ఉత్తమ పద్ధతులను అనుసరించడంలో సహాయపడేలా ఈ పేజీలోని చిట్కాలను రూపొందించాం.

మీ కార్యాలయ విధానాలను, OpenAI విధానాలను గౌరవించండి. మా సాధనాలను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలనే దానిపై మరింత మార్గదర్శకత్వం కోసం OpenAI వినియోగ విధానాలను⁠ చదవండి. మీరు ఉద్యోగంలో ChatGPTని ఉపయోగిస్తుంటే, మీ సంస్థ నియమాలకే ప్రాధాన్యం. కాబట్టి పని కోసం ChatGPTని ఉపయోగించే ముందు సంస్థ AI విధానాలను తెలుసుకోండి.

ముఖ్యమైన పనుల్లో మానవ పర్యవేక్షణ ఉండేలా చూసుకోండి. ⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది)ChatGPT ఇచ్చే సమాచారం తప్పుగా ఉండవచ్చు⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది) లేదా పాతది కావచ్చు. ఎందుకంటే అది శిక్షణ పొందిన డేటాలోని నమూనాల ఆధారంగా సమాధానాలను రూపొందిస్తుంది. ఆ డేటాలో తాజా సమాచారం లేకపోవచ్చు లేదా తప్పులు ఉండవచ్చు. కీలకమైన వాస్తవాలను ఎల్లప్పుడూ విశ్వసనీయ మూలాలతో మరోసారి సరిచూసుకోండి. తప్పులుంటే సంకోచించకుండా బొటనవేలు కిందికి చూపే బటన్‌తో గుర్తించండి. 

పక్షపాతాన్ని, దృక్కోణాన్ని గమనించండి. ⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది)మోడళ్లలో పక్షపాతం ఉండవచ్చు⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది). కాబట్టి అవి ఇచ్చే సమాధానాలను ఎల్లప్పుడూ జాగ్రత్తగా సమీక్షించాలి. అవసరమైనప్పుడు అవి తేల్చిన విషయాలను విమర్శనాత్మకంగా పరిశీలించాలి. పక్షపాతాన్ని తగ్గించడంపై మేం నిరంతరం పరిశోధన చేస్తున్నాం. దీన్ని మెరుగుపరచడానికి మీ సూచనలను స్వాగతిస్తున్నాం.

చట్టపరమైన, వైద్య లేదా ఆర్థిక సలహాలను నిపుణులతో సమీక్షించుకోండి. ChatGPT వృత్తిపరమైన అనుమతి పొందిన నిపుణుడు కాదు. ఇది డేటాలోని నమూనాల ఆధారంగా సమాధానాలు ఇచ్చే సంభాషణాత్మక AI మాత్రమే. అర్హతగల నిపుణుల మార్గదర్శకత్వానికి ఇది ప్రత్యామ్నాయం కాదు. అంటే, ChatGPT ఇచ్చే సలహా మీ పరిస్థితికి అన్ని సందర్భాల్లోనూ సరిపోకపోవచ్చు. ఆరోగ్యం, చట్టం లేదా ఆర్థిక విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, చర్యకు దిగే ముందు తప్పనిసరిగా అర్హతగల నిపుణుడిని సంప్రదించండి లేదా మీ సంస్థ విధానాలను అనుసరించండి.

ChatGPTని ఉపయోగించినప్పుడు ఆ విషయాన్ని పారదర్శకంగా తెలియజేయండి. మీ పనిలో AI వినియోగాన్ని వెల్లడించాలని మీ యాజమాన్యం లేదా విద్యాసంస్థ ఆశిస్తే, సంభాషణ లింకులను⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది) లేదా నమోదులను భద్రపరచండి. తద్వారా ChatGPT ఎలా తోడ్పడిందో ఇతరులు చూడగలరు.

ఇతరుల స్వరాన్ని లేదా డేటాను పంచుకునే ముందు వారి సమ్మతి పొందండి. ⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది)రికార్డ్ మోడ్⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది) (మీ వర్క్‌స్పేస్ నిర్వాహకులు ప్రారంభించి ఉంటే), ఇలాంటి ఇతర సదుపాయాలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు. ఏదైనా రికార్డింగ్‌కు పాల్గొనే వారందరి అంగీకారం ఉందని నిర్ధారించుకోండి. ఈ సదుపాయాలను ఉపయోగించేటప్పుడు మీ సంస్థ విధానాలను అనుసరించండి.

అభిప్రాయాలు తెలియజేయండి, విధానాలకు సంబంధించిన సమస్యలను నివేదించండి. సురక్షితం కాని లేదా తప్పుడు సమాధానాలను గుర్తించడానికి బొటనవేలు కిందికి చూపే బటన్‌ను లేదా నివేదించే ప్రక్రియను ఉపయోగించండి. మీ అభిప్రాయాలు భద్రతను మెరుగుపరచడంలో తోడ్పడతాయి⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది). తద్వారా అందరికీ ప్రయోజనం కలుగుతుంది.

తాజా సమాధానాల కోసం శోధన లేదా డీప్ రీసెర్చ్ ఉపయోగించండి. తాజా సమాచారం ముఖ్యమైనప్పుడు, శోధన⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది) లేదా డీప్ రీసెర్చ్⁠(కొత్త విండోలో తెరుచుకుంటుంది) ప్రారంభించండి. తద్వారా ChatGPT తాజా మూలాల నుంచి సమాచారాన్ని సేకరించగలదు. సమాధానాలపై ఆధారపడే ముందు, పేర్కొన్న మూలాలను పరిశీలించండి, లింకులను తెరిచి వివరాలను సరిచూసుకోండి.

OpenAI అకాడమీతో నేర్చుకోవడం కొనసాగించండి

ప్రాక్టికల్ AI నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి మీకు సహాయపడే అదనపు గైడ్‌లు మరియు వనరులను కనుగొనండి.